నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన పేరుపై సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. చాలాకాలంగా అందరూ తనను ‘అన్నాలెజినోవా’ అని పిలుస్తున్నారని, కానీ పెళ్లి తర్వాత తన పేరును ‘అన్నా కొణిదెల’గా స్వీకరించానని ఆమె వెల్లడించారు. ఇకపై అందరూ తనను ఇదే పేరుతో సంబోధించాలని ఆమె అభిమానులను, మీడియాను కోరారు.