ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు జంతర్మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో వారు నిర్వహిస్తున్ననిరసనలకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసన ప్రదేశానికి చేరుకున్న ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు ఆప్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా అడ్డుకున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. జంతరంతర్ ను మూసివేశారు.