న్యూఢిల్లీ పరిధిలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం,
జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను 8-9 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక సీనియర్ IPS అధికారిని భద్రతా పర్యవేక్షణ కోసం నియమించారు.ఎలక్షన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్ చేరుకున్న AAP నాయకులు సంజీవ్ ఝా, సౌరభ్ భరద్వాజ్‌లను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో 50 మందికి పైగా నిరసనకారులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.