తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మరింత విస్తరించింది.
గాంధీ జయంతిని పురస్కరించుకుని నేడు చెన్నై కోయంబేడు బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్..వెట్రి పయణం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.మెట్రోపాలిటన్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో తిరిగే ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సుల్లోనూ మహిళలు ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు. వీటితో పాటు జిల్లాలను అనుసంధానించే ఆర్డినరీ మొఫిసిల్ బస్సులను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చారు.