ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలను ఆసరాగా చేసుకొని భారత్‌లో దాడులు చేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. అమృత్‌సర్ కమిషనరేట్ పోలీసులు ఐఎస్ఐ మద్దతు గల రెండు ఉగ్రవాద ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు మైనర్లు సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలను ఆసరాగా చేసుకొని పెట్రోల్ బాంబులతో దాడులు చేసేందుకు ఈ ముఠా యత్నించింది. ముఠాలోని సభ్యుల్లో ఎక్కువ మంది మైనర్లే.