ఫ్రాన్స్ రాజధాని పారిస్, చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్ర వేడిగాలుల నుంచి ఎట్టకేలకు ఊరట పొందాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఫ్రాన్స్ ప్రజలకు ఇప్పుడక్కడ భారీ ఉరుములు, భీకర మెరుపులు, కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో పారిస్లో నివసిస్తున్న ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టల్ కెన్నీ రికార్డ్ చేసిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా అవుతోంది. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఓ మెరుపు నేరుగా ఐఫిల్ టవర్ను తాకిన అద్భుత దృశ్యం అది.