ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. పలు చోట్ల ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్ బూత్‌లకు పరిశీలించేందుకు వెళ్లగా.. సుధారెడ్డి కూడా ఆయన్ను వెంబడించారు నేను మా అన్నతోనే మా అన్నతోనే వస్తాను.. అన్నతో వెళదాం.. ఎక్కడికిపోతే అక్కడికి వెళతా. మీ (చెవిరెడ్డి) కారు అయినా ఎక్కుతా’ అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎటు వెళితే అటు వెళతానంటూ సుధారెడ్డి ఆయన్ను వెంబడించారు.