నిరసనల్లో పాల్గొన్న యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ అత్యంత ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. ఆందోళనలకు సంబంధించిన రీల్స్ చూస్తుంటే తనకు అసహ్యం వేస్తోందని.. వారి భాష, మాట్లాడే తీరు వికారం, వాంతి వచ్చేలా ఉన్నాయని కంగన విమర్శించారు “ఛీ.. వీరికి జన్మనిచ్చి పెంచుతున్నది ఎవరు?” అని ప్రశ్నించడమే కాకుండా.. ఈ రీల్స్ చూసి మనస్తాపానికి గురయ్యానని, తనకు డిజిటల్ డిటాక్స్ అవరసరమని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కంగనా రనౌత్ పేర్కొన్నారు.