ఏపీలో తీవ్రంగా కరువు పరిస్థితులున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సిఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే వాతావరణ శాఖ హెచ్చరించినా.. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు చేపట్టకపోవడమేంటన్నారు. 688 మండలాలు ఉంటే.. 628 మండలాల్లో కరువు ఉందన్నారు.332 మండలాల్లో పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయని వివరించారు.