కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని తీవ్ర వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి మృతదేహాలు రోడ్డు పై చెల్లా చెదురుగా పడిపోగా కారు నడుపుతున్న వ్యక్తి మృతదేహం కారులోనే ఇరుక్కుపోయింది.