భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూనే, సమాజ హితం కోసం ఆయన చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో తాను కూడా భాగమవుతున్నట్లు ప్రకటించారు ఈ సేవా సంకల్పంలో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో 1,000 మంది మహిళలకు ఉచితంగా ఉపాధి నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) శిక్షణ అందించనున్నట్లు రామ్ చరణ్ ప్రతిజ్ఞ చేశారు.