తీవ్ర వర్షాభావం వినాయక చవితి వేడుకలపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిమజ్జనానికి సరిపడా నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో, విగ్రహాలను నిమజ్జనం చేయలేక అలాగే వదిలేయాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహాలను నిమజ్జనం చేయలేక చెరువుల గట్ల వద్దే వదిలివెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. సాగునీటికే దిక్కులేని ఇటువంటి క్లిష్ట సమయంలో POP విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను పూజించడమే ఉత్తమమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.