హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదుట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సమసమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం కొనియాడారు. గౌడ, నేత, గీత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. నేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని, తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు.గౌడలు తలచుకుంటే మరో ఐదుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావచ్చని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.