తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారిందని దాని ప్రభావంతో జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నారాయణ పేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని.. మరికొన్ని గంటల్లో మిగిలిన ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.