నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలుగు బోధిస్తున్న భాస్కర్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడనే వార్త తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారితీసింది. లెక్చరర్ భాస్కర్ వేధింపులు తాళలేక విద్యార్థినులు కళాశాల గేటు ముందు బైఠాయించి పెద్దెత్తున ఆందోళనకు దిగారు. ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన లెక్చరర్ భాస్కర్‌ను చూసిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఆ కీచక ఉపాధ్యాయుడికి అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు.