నర్సంపేటలో అర్దరాత్రి దొంగ చాటుగా కాంగ్రెస్ సర్కార్ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.అభిమానంతో ఒక వ్యక్తి ప్రైవేట్ స్థలంలో చిన్న విగ్రహం ఏర్పాటు చేశాడు.ఈరోజు దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు.రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.