డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి సంధ్య (28) ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ గా ఖమ్మంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవలే ఇంటికి వచ్చిన సంధ్య.. సోమవారం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతులకు చిన్న కూతురు సంధ్య (28) చదువులో చురుగ్గా ఉండేవారు.గతంలో గ్రూప్-4 ఉద్యోగం సాధించి మున్సిపాలిటీలో కొంతకాలం పనిచేశారు. అనంతరం గ్రూప్-2 DTగా ఎంపికయ్యారు.