అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.అమరావతిలోని సీఎంఓ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో జిల్లా అధికారులు నిరంతరం టచ్లో ఉండాలని గల్లంతైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ లభించేంత వరకు కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.