అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో కలకలం రేపిన విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్తో పాటు మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్చిట్ ఇచ్చింది. విరాళాల దుర్వినియోగం, చోరీ వ్యవహారంలో వీరిద్దరికీ ఎలాంటి ప్రమేయం లేదని సిట్ తన తుది నివేదికలో స్పష్టం చేసింది. అక్రమాల విషయం తెలియగానే చర్యల కోసం తానే మొదట అధికారులకు ఫిర్యాదు చేశానని చంపత్‌రాయ్ సిట్ ఎదుట స్పష్టం చేశారు.