నీట్-యూజీ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడం నిజమేనని సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం తెలిపింది. జులై 25న సివాన్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని స్పష్టం చేసింది. ఆందోళనకారుల మధ్య కానిస్టేబుల్ చిక్కుకుపోవడంతో ఏకే-47తో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ మేరకు అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది. మరోవైపు, నిరసనకారులను చెదరగొట్టేందుకు హతి చౌక్ సమీపంలో ASI నిలేశ్ కుమార్ కూడా 9ఎంఎం పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పుకొచ్చింది.