ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై మంత్రి వర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు 24.15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా కేబినెట్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.