ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఓ నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెకు పలుమార్లు సెల్యూట్ చేయడం సముచితం కాదంటూ డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ విమర్శించింది. విజయ్ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. ‘స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి విజయ్ హుందాతనం గాలిలో కలిసిపోయింది. ఏమాత్రం సిగ్గు, సంకోచం లేకుండా ఆయన ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టారు. పదేపదే ఒకరికొకరు వందనాలు చేసుకున్నారు. ఆయనకు ఓటు వేసిన వారు సైతం ఈ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయారు’ అని ‘మురసోలి’ పేర్కొంది.