విశాఖపట్నం షీలానగర్ నుంచి పోర్టుకు వెళ్లే మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం అక్కడ వేసిన మట్టికుప్ప నుంచి మూడు డెడ్ బాడీలు బయటపడటంతో స్థానిక ప్రజలు, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మృతదేహాలు ఎవరివి, హత్య చేసి ఇక్కడ మట్టిలో పూడ్చిపెట్టారా లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో, రోడ్డు పనుల కోసం మట్టిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.