జంతర్ మంతర్ సహా ఢిల్లీలో జరిగిన నిరసనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు, పోలీసుల బల ప్రయోగంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు తుది అంచనాకు రావడానికి సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లూ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్దులపై కేసులు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ప్రమాదంలో పడింది.