ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు ఖరారు అయ్యాయి. ప్రస్తుతం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడిగా వర్ల రామయ్య ఉన్నారు. ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు మండలిలో ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దళవాయి రమాదేవి తెదేపా అనంతపురం లోక్ సభ నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలిగా ఉన్నారు.