కోకాపేటలో ‘ట్రంప్ హైదరాబాద్ టవర్స్’ను నిర్మించనున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంయుక్తంగా ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నాయి. 65 అంతస్తులతో నిర్మించనున్న ఈ ట్రంప్ టవర్స్లోలో అత్యంత ఖరీదైన 450 ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పటికే దీని నిర్మాణానికి రెరా అనుమతులిచ్చింది. మూడేళ్లలో టవర్స్ పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు తెలిపాయి. త్వరలో జరగనున్న భూమిపూజలో ట్రంప్ కుటుంబసభ్యులు పాల్గొంటారని చెప్పాయి. ట్రంప్ పేరుతో దేశంలో పుణె, ముంబయి, కోలకతా, గురుగ్రామ్ నాలుగు ప్రాజెక్టుల పూర్తి చేసింది.