గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నడుం బిగించింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. గ్రామీణ విద్యార్థులకు సైతం పట్టణ ప్రాంతాలతో సమానంగా మెరుగైన సౌకర్యాలు అందించడమే ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని తన స్వగ్రామం నుంచే అభిజీత్ దీప్కే ప్రారంభించనున్నారు.