సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు వీలుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూములు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించడానికి కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సును అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.