స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా ‘విభజన విభిషిక స్మృతి దివస్’ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విభజన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను, వారి అద్భుతమైన పోరాట పటిమను ఆయన కొనియాడారు. చారిత్రక విభజన ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చారిత్రక దినోత్సవం దేశంలో సామరస్యం, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ ఆకాంక్షించారు.