కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గతంలో మద్రాస్ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబాలకు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే తప్పేంటని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టును ప్రశ్నించింది. ప్రభుత్వ సంక్షేమ మరియు ఉపశమన చర్యల్లో న్యాయస్థానాల జోక్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో విజయ్ సర్కార్కు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.