కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. దోమకొండ ఎక్సైజ్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అనిల్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి, భార్య ఇంట్లో లేని సమయంలో అనిల్ పడిపోయి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆందోళనకు గురైన వారు అనిల్‌ను సమీప ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్ఐ అనిల్ హఠాన్మరణంపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.