కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌కు చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. ఈ నెల 15 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులు ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. విధి మేఘ కోసం వెతుకుతుండగా కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది.