ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల రైతుల ఇబ్బందులు నానాటికి పెరిగి పోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ ఓ రైతు తోపుడు బండిపై ధాన్యం తరలించి వినూత్న నిరసన తెలిపారు.లారీల కొరతతో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో కందాడి మహిపాల్ రెడ్డి(అనే రైతు ఆలేరు మండలం కొలనుపాక నుంచి ఆలేరు మార్కెట్ యార్డుకు కాలికి చెప్పులు లేకుండా ధాన్యాన్ని తోపుడు బండిపై తరలించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.