గంటల వ్యవధిలో శాంతి ఒప్పందం ప్రచారం దశలోనే గల్ఫ్‌లో తిరిగి యుద్ధవాతావరణం రగులుకుంది. తమ గగనతలంలో క్షిపణి, డ్రోన్ల దాడులు జరిగాయని కువైట్ గురువారం తెలిపింది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న కువైట్‌పై ఇరాన్ తరచూ సైనిక దాడులకు దిగుతోంది. ఇరాక్‌లో ఇరాన్ మద్దతు గల షియా మిలిటెంట్లు నుంచి కూడా కువైట్ పై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు పూర్తిగా ఫలించి ఏ క్షణంలో అయినా ఒప్పందం కుదురుతుందనే వార్తల దశలోనే గల్ఫ్‌లో తిరిగి ఉద్రిక్తతలు నెలకొన్నాయి.