ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని మైత్రీవనం కూడలిలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ కుమారులు మోహనకృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటుడు మంచు మనోజ్ తో పాటు కాంగ్రెస్ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

