నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం కురిసిన అకాల వర్షం తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చింది. ఈ జడివానకు తోడు ఈదురు గాలులు, గాలి దుమారం రేగడంతో పాటు వడగండ్ల వాన కూడా కురవడంతో నగర ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ గాలివాన బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపడటంతో పాటు స్తంభాలు కూడా నేల కూలాయి.