తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కీర్తన కార్పొరేట్ స్టైల్ తరహా రీల్స్ చేస్తున్నారు. పాత సాంప్రదాయ ప్రసంగాలు పక్కన పెట్టి కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పెట్టుబడులను తీసుకురావడం కోసం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు మంత్రి కీర్తన. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలతలను మంత్రి కీర్తన ఇంగ్లీష్ లో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త పద్దతి బాగుందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

