మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల చాలాకాలంగా తను అనుభవిస్తున్న ఆవేదనను బయటకు చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ‘నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాను? సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ వల్ల నాలో మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో పూర్తిగా తెలుసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది శ్రీజ.