ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడిన తరువాత, సెవెన్ హిల్స్ హాస్పిటల్ డాక్టర్లను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. బాధితులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతవరకు కార్మికులకు ఇబ్బందులు లేవని గుర్తు చేశారు.