మానవత్వంతో వ్యవహరించాల్సిన చోట రాజకీయాలు చేయడం తగదని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచే పరిహారం ప్రకటించారంతే. బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని జగన్ ప్రకటించారు.

