దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరంలో జూన్ 9, 2026 (మంగళవారం) అర్ధరాత్రి వేళ అత్యంత భయానక విచక్షణారహిత కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. టొయోటా క్వాంటం మినిబస్‌లో వచ్చిన 10 మందికి పైగా సాయుధ దుండగులు వేర్వేరు లొకేషన్లలో ఉన్న స్థానికులపై ఏకధాటిగా తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా సాగుతున్న అక్రమ మైనింగ్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు లేదా స్థానిక గ్యాంగ్ వార్లే ఈ ఘోరానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.