మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని కొడాలి నాని గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేస్తూ.. ముందు ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
విజయవాడలో మీడియా సమావేశాలు పెట్టడం కాకుండా, దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం గుడివాడలో నానికి రాజకీయ స్థానం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.