దేశ రాజధాని ఢిల్లీలోని పాత ఢిల్లీ పరిధిలోని చావ్డి బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ సమీపంలోని ‘గలీ సితారా’లో ఈ ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టం కావడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన ధూళి, కేకలతో నిండిపోయింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ వాహనాలతో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.