చలనచిత్ర పరిశ్రమను పైరసీతో ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని పేర్కొంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కనీసం కొన్ని ఖాతాలనైనా అన్‌ఫ్రీజ్ చేయాలని కోరాడు. ఖాతాలు పనిచేయకపోవడంతో కుటుంబ ఖర్చులు, నిత్యావసరాల కోసం డబ్బులు సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారిందని పిటిషన్లో పేర్కొన్నాడు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఖాతాలను ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఉందా? లేక కొన్ని ఖాతాలపై వెసులుబాటు కల్పించవచ్చా? అన్నది విచారణలో తేలనుంది.