పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ధరణికోటలో ఏర్పాటు చేసిన రూరల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు.

