ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలను పూర్తిగా నిషేధించింది. అధికారుల లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 76 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 91 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 20 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 8 గ్రామాలు, అనంతపురం జిల్లాలో 14 గ్రామాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు, కడప జిల్లాలో 10 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు.

