ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘకాల స్వప్నాన్ని సాకారం చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోదావరి నీటిని విడుదల చేశారు. కాలువలో 111వ కిలోమీటర్ వరకు ముందుగానే నీటిని తరలించి నిల్వ ఉంచగా, పాయకరావుపేట రెగ్యులేటర్‌ను రైతులతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి పుష్కర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు. జలహారతి అనంతరం గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసి చల్లగా చూడాలని ప్రార్తించారు.