అయోధ్య రామమందిర్ ట్రస్టు బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత వైమానిక దళంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పశ్చిమ వైమానిక కమాండ్‌కు నాయకత్వం వహించిన అధికారిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాల సైనిక సేవలో జితేంద్ర మిశ్రా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.