హిట్ అండ్ రన్ కేసులో టీటీడీ బోర్డ్ మెంబర్, పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. రాయదుర్గం పీఎస్‌లో సందీప్ ఓ చైర్‌లో కూర్చున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సందీప్ గంజాయి మత్తులో మునిగి తేలుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సందీప్ గంజాయి సేవిస్తూ మత్తును ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

