మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ భగ్గుమన్నారు. టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. అధిష్టానం ముందు తనను బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశాడని పేర్కొన్న సురేఖ రేవంత్ బ్రదర్స్, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి కలిసి తమను కావాలనే టార్గెట్ చేశారని వెల్లడించారు. రేవంత్ తెలుగుదేశం (టీడీపీ) నుంచి వచ్చాడని, టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని ఆమె ధ్వజమెత్తారు.